అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి

అమెరికాలోని హ్యూస్టన్ నగరాన్ని భారీ వర్షాలు అతాలకుతం చేశాయి. పెను గాలులతోపాటు భారీ వర్షం కురువడంతో.. పెద్దపెద్ద చెట్లు, పలు భవనాలు నెలకొరిగాయి. వర్షాల కారణంగా నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గంటలకు వంద నుంచి 160 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచడంతో.. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో ఇళ్లు, వ్యాపారల కేంద్రాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 

దీంతో హ్యూస్టన్ స్కూల్ డిస్ట్రిక్ట్ మే 17వ తేదీ శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయని ప్రకటించింది. వాతావరణం కారణంగా నగరంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. బుష్ ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో 60 mph వేగంతో గాలులు వీచాయి.

హ్యూస్టన్ మేయర్ జాన్ విట్‌మైర్ మీడియాతో మాట్లాడుతూ.. 100 mph వేగంతా ఈదురు గాలులు వీస్తున్నాయని..  దీంతో రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయని తెలిపారు. విద్యుత్ స్థంబాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. విద్యుత్ పునరుద్ధరించడానికి 24 గంటల సమయం  పడుతుందని.. మరికొన్ని  చోట్ల 48 గంటలు పడుతుందని తెలిపారు.  సుడిగాలుల వీచే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని కోరారు.