![లక్డీకాపూల్‌లో మురుగు సమస్య పరిష్కారం](https://static.v6velugu.com/uploads/2025/02/sewage-overflow-problem-solved-in-lakdikapool_OPp0l8Em7Y.jpg)
హైదరాబాద్‌సిటీ,వెలుగు : లక్డికపూల్ లో సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్య పరిష్కారమైంది. జెట్టింగ్ మెషీన్‌తో సిల్ట్ బయటికి తీసి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు. కొద్ది రోజుల కింద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇక్కడ డీ-సిల్టింగ్ పనులు చేసి సిల్ట్ తొలగించారు.
మళ్లీ అందులో వ్యర్థాలు వేయడంతో పూడుకుపోయి ఓవర్ ఫ్లో అయింది. మ్యాన్ హోళ్లలో చాలామంది ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు వేస్తుండడంతో అవి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. నగరవాసులు తమ సీవరేజ్ పైపు లైన్ ను నేరుగా వాటర్‌బోర్డు సీవరేజ్ నెట్ వర్క్ కు కలపడంతో సమస్యలు వస్తున్నాయంటున్నారు.