బెల్లంపల్లిలో సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలు

బెల్లంపల్లిలో సేవాలాల్  286వ జయంతి ఉత్సవాలు

బెల్లంపల్లి, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి  సేవాలాల్ మహారాజ్, జగదాంబ అమ్మవారిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ బంజారాల అభ్యున్నతికి సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో  హరికృష్ణ, పెద్దసంఖ్యలో బంజారాలు పాల్గొన్నారు.

 బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ నెంబర్  2  క్రీడా మైదానంలో బెల్లంపల్లి  ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే వినోద్ క్రికెట్ ఆడి ప్రారంభించారు. క్రీడల్లో  గెలుపు ఓటములు సహజమన్నారు. కాంగ్రెస్ లీడర్లు ముచ్చర్ల మల్లయ్య, సన్నిబాబు, పోచంపల్లి హరీశ్, ఎలుక ఆకాశ్, నిచ్చకోల వంశీ, రాములు నాయక్ పాల్గొన్నారు.