హైదరాబాద్ సిటీ, వెలుగు: మెహిదీపట్నంలోని కింగ్స్ రెస్టారెంట్ సీవరేజ్కనెక్షన్ను వాటర్‌బోర్డు అధికారులు కట్ చేశారు. ఈ రెస్టారెంట్ నుంచి వస్తున్న వ్యర్థాలతో తరచూ మెయిన్‌రోడ్డుపై మురుగు ఓవర్‌ఫ్లో అవుతోంది. ఇటీవల వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కింగ్స్రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వహకులు ఎలాంటి అనుమతులు లేకుండా 250 ఎంఎం డయా సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం సీవరేజ్కనెక్షన్ను కట్ చేశారు. ఎక్కడైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే వాటర్‌బోర్డు విజిలెన్స్ విభాగానికి 99899 98100, 99899 87135 సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.