105 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

105 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

వికారాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్​సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వికారాబాద్​నియోజకవర్గానికి చెందిన 105 మంది మహిళలకు బుధవారం ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఉచితంగా 105 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​మాట్లాడుతూ.. 

కుట్టు మిషన్లతో ఇంటి వద్దే ఉపాధి పొందవచ్చన్నారు. టైలరింగ్​కు డిమాండ్ ఉందని, శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు పని  కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.