బాన్సువాడలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ 

బాన్సువాడలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ 

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం  ఎస్సీకార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మహిళలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్​ కలెక్టర్​ కిరణ్మయి 15 కుట్టుమిషన్లను అందజేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రిస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కామారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దయానంద్, దళిత నాయకులు గంగారాం, వెంకటేశ్​, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి  పాల్గొన్నారు.

సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతం చేయండి. బాన్సువాడ డిగ్రీ, పీజీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. గురువారం కాలేజీలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. డిగ్రీ పూర్వ విద్యార్థులు వేడుకలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. సమావేశంలో డిగ్రీ కాలేజీ అధ్యాపక బృందం, కాంగ్రెస్ నాయకుడు శివదయాల్ వర్మ పాల్గొన్నారు.