పేద మహిళలకు కుట్టు మిషన్ యంత్రాలు పంపిణీ
సికింద్రాబాద్, వెలుగు: మోండా మార్కెట్ డివిజన్ లోని జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పేద మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు. అతిథిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి పాల్గొన్నారు. తాను అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్డెవలప్ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయన్నారు. మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.