
చెన్నైకు చెందిన టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్ విడాకుల వివాదం దేశవ్యాప్తంగా సం చలనంగా మారిన విషయం తెలిసిందే. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ లు కూడా ఉన్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే తాజాగా ఆయన భార్య దివ్య శశిధర్ ఆయనపై సంచలన ఆరోపణ చేశారు.
ఆయనతో పెళ్లి తన జీవితంలో మరిచిపోలేని పీడకలగా చెప్పిన దివ్య... తమకు బాబు పుట్టిన కొన్నిరో జుల నుంచే శృంగారం చేయమని భార్త వేధిం చేవాడని ఆరోపించారు.
తాను నిరాకరిస్తే వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి శృంగారం చేస్తానని బెదిరిం చేవాడని తెలిపారు. చివరకి తన ఫ్రెండ్స్ తోనూ పడుకోమని ఇబ్బంది పెట్టేవాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరి విడాకుల వ్యవ హారం ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.