
హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా విదేశీ అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును చాదర్ ఘాట్ పోలీసులు రట్టు చేశారు. బర్మా దేశం నుంచి యువతులు, బాలికలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ టీం పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసుల సంయుక్త దాడులలో ఈ వ్యభిచార ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది.
చాదర్ ఘాట్ పోలీసులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. చాదర్ ఘాట్ మూసా నగర్ కేంద్రంగా ఈ వ్యభిచారాన్ని సాగిస్తున్నారు. ఇళ్ల మధ్యలో వ్యభిచార గృహం నడుపుతున్నారన్న సంగతి తెలిసి బస్తీవాసులు కంగుతిన్నారు. పట్టుబడిన ముఠా సభ్యులలో ఇద్దరు యువతులు, ఇద్దరు మైనర్ బాలికలు, ఏడుగురు యువకులు ఉన్నారు. యువతులు,బాలికలు బర్మాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు.