- నిందితుడి వయస్సు 16 ఏండ్లు
- పోక్సో కింద కేసు నమోదు
తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లా తల్లాడ మం డలంలో ఆరేండ్ల బాలికపై ఓ బాలుడు లైంగిక దాడి చేశాడు. ఎస్సై బి.కొండలరావు కథనం ప్రకారం.. వెంకటరాముని తండాలో ఆదివారం ఆరేండ్ల బాలిక వీధిలో ఆడుకుంటోంది. ఆమె ఇంటి దగ్గరే ఉండే ఓ బాలుడు (16) బాలికను ఎత్తుకొని తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో బాలుడి ఇంట్లో ఎవరూ లేరు.
బాలిక అన్నయ్య ఆడుకుంటూ బాలుడి ఇంటివైపు వెళ్లాడు. అక్కడ తన చెల్లిపై బాలుడు లైంగికదాడి చేస్తుండగా చూశాడు. వెంటనే పరిగెత్తుకు వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె వచ్చేసరికే బాలుడు పరారయ్యాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో తల్లాడ పోలీసులు బాలుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.