ఎటువంటి దృవీకరణ పత్రాలు లేకుండా భువనేశ్వర్‌లో ఉంటున్న బంగ్లాదేశ్‌కి చెందిన సెక్స్ వర్కర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డు ఆధారంగా సదరు మహిళ ఒడిశాలోకి ప్రవేశించింది. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అన్నట్లుగా.. ఆ మహిళ తనను ఇద్దరు పురుషులు లైంగికంగా వేధించారని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే.. సరైన అనుమతి పత్రాలు లేకుండా భారత్‌లో ఉంటున్నందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
కటక్ రోడ్‌లోని చింతామణిశ్వర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఇద్దరు పురుషులు తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ డిసెంబర్ 16న ఓ మహిళ లక్ష్మీసాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు పంపించినట్లు భువనేశ్వర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనూప్ కుమార్ తెలిపారు.
‘తదుపరి దర్యాప్తులో సదరు మహిళ బంగ్లాదేశ్ జాతీయురాలిని తేలింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి ఆమె ఒడిశాకు వచ్చిందని తెలిసింది. ఆమె ఫిర్యాదు చేసిన సమయంలో ఇచ్చిన వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి చిరునామా లేదని మేము తెలుసుకున్నాము. దాంతో మేము ఆమెను మరింత విచారించగా ఆమె బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్‌కి వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది’ అని డిసీపీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఆమె కొంతకాలం మాంసం వ్యాపారం నిర్వహించిదని, ఆ తర్వాత ఆమె భువనేశ్వర్‌కి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమె వద్ద ఎటువంటి పాస్‌పోర్టు కానీ, వీసా కానీ లేవని ఆయన తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 419,468,471, విదేశీ చట్టంలోని సెక్షన్ 14 కింద ఆమెపై కేసు నమోదైందని డీసీపీ అనూప్ కుమార్ తెలిపారు.
For More News..