కొమురంభీం జిల్లా జైనూర్ మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళపై జరిగిన లైంగికదాడిని నిరసిస్తూ.. ఇవాళ పట్టణంలోని సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాల నుంచి పెద్ద ఎత్తున్న ఆదివాసీలు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వసం చేశారు. దీంతో జైనూర్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకారులు మార్కెట్లో తోపుడు బండ్లను నిప్పు అంటించారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో స్పెషల్ పార్టీ పోలీస్టీమ్లను రంగంలోకి దింపారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.