హాలియా, వెలుగు: లైగింక వేధింపుల ఆరోపణలతో నల్గొండ జిల్లా హాలియా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయ నాయక్ ను సస్పెండ్ చేస్తూ గురువారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) జయప్రద భాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ విజయ నాయక్ తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్ గత ఏడాది ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లయింట్ఇచ్చారు. దీంతో స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో గురువారం ప్రిన్సిపాల్ విజయనాయక్ ను సస్పెండ్ చేశారు.