బెంగళూరులాంటి పెద్ద సిటీలో మహిళలపై లైంగిక వేధింపులు కామన్: హోంమంత్రి పరమేశ్వర

బెంగళూరులాంటి పెద్ద సిటీలో మహిళలపై లైంగిక వేధింపులు కామన్: హోంమంత్రి పరమేశ్వర

బెంగళూరు: కర్నాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. బెంగళూరు పెద్ద సిటీ అని, మహిళలపై వేధింపులు కామన్ అని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద సిటీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుంటాయని అన్నారు. ఆయన కామెంట్లపై నెటిజన్లతో పాటు మహిళలు మండిపడుతున్నారు. కాగా, కొన్ని రోజుల కింద బెంగళూరులోని బీటీఎం లే అవుట్‌‌‌‌లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయ్యాడు. ఒకామెతో అసభ్యకరంగా ప్రవర్తించి పారిపోయాడు.

దీంతో షాక్‎కు గురైన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. ‘‘పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు కామన్.. పట్టించుకోవద్దు. అమ్మాయిని వేధించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కమిషనర్​తో నేను ఫోన్​లో మాట్లాడిన. ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు కామన్ ​గానే ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది’’ అని పరమేశ్వర అన్నారు. హోంమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.