సెక్సువల్​ వయొలెన్స్​ నుంచి బయటపడ్డా.. వాళ్లకు ఆదరణ కరువైంది

సెక్సువల్​ వయొలెన్స్​ నుంచి ప్రాణాలతో బయటపడినా వాళ్లను సొసైటీ మునుపటిలా ఆదరించడం లేదు. అలాగే చట్టపరంగానూ భద్రత లేదు. యురాసియా రీజియన్​లోని మహిళలు ఈ ఏడాది జనవరిలో పెద్ద ఎత్తున ‘రోడ్​ బ్లాక్స్​’​ వంటి వెరైటీ కార్యక్రమాలు చేపట్టారు. యూరప్​, ఆసియా ఖండాలను కలిపి ‘యురాసియా’ అంటారు. ఈ రీజియన్​లో మొత్తం 93 దేశాలు ఉన్నాయి. న్యాయం కోరుతూ ఆడవాళ్లు ఈ రీజియన్​​లో ఇలాంటి నిరసనలు నిర్వహించటం ఇదే తొలిసారి. రోడ్​ బ్లాక్స్​ అంటే మహిళలను అటు సొసైటీ, ఇటు చట్టం రెండూ ఆదరించలేకపోతున్నాయనే అర్థంతో ఉద్యమాన్ని నడిపించారు. పెళ్లికూతుళ్ల కిడ్నాపింగ్​, చైల్డ్​ మ్యారేజ్​లు సహా మహిళలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి చట్టాలను, పాలసీలను, ప్రభుత్వాల చర్యలను పూర్తిగా మార్చాల్సి ఉందని తేల్చిచెప్పారు. గతంలో సోవియెట్​ యూనియన్​లో ఉన్న 15 దేశాల్లో సెక్సువల్​ వయొలెన్స్​కి సంబంధించిన చట్టాలను రివ్యూ చేసి, లోపాలను సవరించారు. ఆర్మేనియా, మాల్దోవా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, జార్జియా, అజర్​బైజాన్​, తజికిస్థాన్, కిర్గిజ్​స్థాన్​, బెలారస్​, ఉజ్బెకిస్థాన్​, తుర్క్​మెనిస్థాన్​, ఉక్రెయిన్​, కజక్​​​స్థాన్​, రష్యా దేశాలు మహిళల విషయంలో చొరవ తీసుకున్నాయి.

అమెరికా​లో రాజ్యాంగ సవరణకు ఒప్పించారు

చాలా ఆధునిక దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పటికీ ఆడవాళ్లకు మగవాళ్లతో సమానంగా హక్కులు లేవు.  దీనికోసం రాజ్యాంగ సవరణ చేయడానికి యూఎస్​ కాంగ్రెస్​ ఈ ఏడాది మేలో చర్చ చేపట్టింది. అమెరికా చట్ట సభ ఇలాంటి హియరింగ్​ జరపటం 36 ఏళ్లలో ఇదే తొలిసారి. ‘ఈక్వల్​ రైట్స్​ అమెండ్​మెంట్​ (ఈఆర్​ఏ)’ బిల్లుపై వచ్చే జనవరిలో ఓటింగ్​ జరగనుంది.  ఈఆర్​ఏ బిల్లును ఓకే చేయాల్సిన చిట్టచివరి (38వ) రాష్ట్రం వర్జీనియా. ఇక్కడ కూడా పాసైతే ఆ బిల్లు చట్టంగా మారుతుంది.

వాంకోవర్​లో ఉమెన్​ డెలివర్​–2019 సమ్మిట్​

2030 నాటికి ప్రపంచంలో జెండర్​ బయాస్​ అనేదే ఉండకూడదన్నది మహిళల నినాదం. దీనికి సంబంధించిన ‘ఉమెన్​ డెలివర్​ కార్యక్రమం’ ఈ ఏడాదే వాంకోవర్​ (కెనడా)లో జరిగింది. ఈ సమ్మిట్​కి దాదాపు 8 వేల మంది హాజరయ్యారు. వీరిలో వివిధ దేశాల లీడర్లు, ఇన్​ఫ్లుయెన్సర్లు, యాక్టివిస్టులు, అడ్వొకేట్లు, విద్యావేత్తలు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.

ఆటల్లోనూ సమాన అవకాశాల కోసం

ఉమెన్​ స్పోర్ట్స్​కి సంబంధించి 2019ని తిరుగులేని ఏడాదిగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జరిగిన ఉమెన్స్​ వరల్డ్​ కప్​ని తొలిసారిగా రికార్డు స్థాయిలో వంద కోట్ల మంది చూశారు. ఇరాన్​లో ఫుట్​బాల్​ పోటీలను మహిళలు స్టేడియానికి వచ్చి చూసే అవకాశంకూడా ఈ ఏడాదే కల్పించారు. ఆటపై అభిమానంతో సహర్​ ఖోడయారీ అనే యువతి మగ వేషంలో స్టేడియంలోకి వెళ్లింది. దీనిని కోర్టు నేరంగా పరిగణిం చి ఆరు నెలల జైలు శిక్ష వేసేందుకు సిద్ధమైంది. దీంతో ఆమె కోర్టు హాల్​ బయట ఒంటికి నిప్పంటించుకొని సూసైడ్​ చేసుకుంది. ఈ ఘటన ఇరాన్​ సర్కారు కళ్లు తెరిపించింది.

ఇకపై నార్త్​ ఐర్లాండ్​లోనూ అబార్షన్​ ఇల్లీగల్​ కాదు

నార్త్​ ఐర్లాండ్ బ్రిటన్​లో భాగమే అయినా అక్కడ ఇన్నాళ్లూ అబార్షన్​ను ఇల్లీగల్​గానే పరిగణించారు. అత్యాచారంతో గర్భం దాల్చినా, వావీవరసలు లేని పెళ్లి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్​ చేయించుకోకూడదు. అయితే, అది​ నేరం కాదని చెప్పే చట్టాన్ని 1967లోనే రూపొందించినా అక్కడ అమలు కావడం లేదు.  దీనిపై మహిళలు ఉద్యమించి విజయం సాధించారు.

అర్జెంటీనాలోనూ ఇలాంటి బిల్లుకే మద్దతు

అర్జెంటీనాలో కూడా ఇన్నాళ్లూ అబార్షన్​ని ఇల్లీగల్​గానే భావించారు. రేప్​ వల్ల గానీ అసాధారణ పరిస్థితుల్లో గానీ గర్భం దాల్చితే మినహాయింపు ఇచ్చేవారు. అబార్షన్​ను లీగలైజ్​ చేయాలనే బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడంతో 10 లక్షల మంది మహిళలు రోడ్ల మీదికి వచ్చి మద్దతు తెలిపారు.

లాటిన్​ అమెరికాలోనూ ఆగ్రహం

బొలీవియాలో పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలపై లైంగిక హింస చాలా ఎక్కువ. దీనికి ఫుల్​స్టాప్​ పెట్టాలని ‘ఇంటర్​ అమెరికన్ కమిషన్​ ఆన్​ హ్యూమన్​ రైట్స్​ (ఐఏసీహెచ్​ఆర్​)’ను డిమాండ్​ చేస్తున్నారు.