నవంబర్ 30న సర్కారు స్కూళ్లు బంద్: ఎస్ఎఫ్ఐ

హైదరాబాద్, వెలుగు: వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30న సర్కారు స్కూళ్ల బంద్​కు పిలుపునిస్తున్నట్టు ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్​ఎల్ మూర్తి, టి.నాగరాజు తెలిపారు. గురుకులాలు, బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : ఫుడ్ పాయిజన్పై టాస్క్ ఫోర్స్.. బాధ్యులను తేల్చనున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యాశాఖకు మంత్రి లేకుండా ఏడాది పూర్తికావొస్తోందని, సమస్యలపై రెగ్యులర్​ గా సమీక్షలు చేయట్లేదన్నారు. సీఎం తక్షణమే స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలోని సమస్యలను రివ్యూ చేసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలని కోరారు. 30న జరిగే స్కూళ్ల బంద్ కు సహకరించాలని కోరారు.