ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

కరీంనగర్ సిటీ, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కరీంనగర్​కలెక్టరేట్ ను ముట్టడించారు. అంతకుముందు నగరంలోని తెలంగాణ చౌక్‍ నుంచి కలెక్టరేట్‍ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య రంగాన్ని బ్రష్టు పట్టించిందన్నారు.

రెండేళ్ల నుంచి విద్యార్థికి స్కాలర్​షిప్​, ఫీజు రియింబర్స్​మెంట్​ విడుదల చేయకపోవడంతో విద్యార్థులను  ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వేధిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్​మీద లేదని మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అరవింద్, రోహిత్, విద్యార్థులు పాల్గొన్నారు.