మానుకోట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడి

మానుకోట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడి
  • పెండింగ్ స్కాలర్ షిప్ లు చెల్లించాలని డిమాండ్ 
  • భారీ ర్యాలీగా వచ్చి బైఠాయించిన విద్యార్థులు 
  • పోలీసుల హామీతో ఆందోళన విరమణ 

మహబూబాబాద్,వెలుగు : పెండింగ్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.  సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్​క్యాంపు ఆఫీస్​ను ముట్టడించి బైఠాయించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ మానుకోట జిల్లా కన్వీనర్ పట్ల మధు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో ఉన్నత చదువులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా  నిధులను విడుదల చేయడం లేదన్నారు.

మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రూ.8 వేల కోట్ల పెండింగ్​ స్కాలర్​షిప్​లను విడుదల చేయాలని  కోరారు. పోలీసుల హామీతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. ఎస్​ఎఫ్​ఐ కో కన్వీనర్లు సూర్య ప్రకాశ్, జ్యోతిబసు, బాణోత్ సింహాద్రి,రాజేశ్, గుండ్ల రాకేశ్,వీరేందర్, చరణ్,అరుణ్,కళ్యాణ్,అఖిల,అనిత తదితరులు పాల్గొన్నారు.