కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ఖాళీ ఇస్తరాకులు పట్టుకుని ఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ, గురుకుల హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా బీసీ కళాశాల హాస్టళ్ల విద్యార్థులకు బెడ్ షీట్లు పంపిణీ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను రూ.3000కి పెంచాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ప్రభుత్వం పాకెట్ మనీ రూ.500 ఇవ్వడం లేదన్నారు.