ఆడిట్ రిపోర్టులు పరిశీలించాకే ఫీజులు ఖరారు చేయాలి : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ మూర్తి

ఆడిట్ రిపోర్టులు పరిశీలించాకే ఫీజులు ఖరారు చేయాలి : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ మూర్తి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కాలేజీల్లో ఆడిట్ రిపోర్టులు పరిశీలించాకే ఫీజుల పెంపుపై తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు కోరారు. ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల యాజమాన్యాలు గతంలో లక్షల రూపాయలు ఫీజులు పెంచుకొని, కాలేజీల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నకిలీ ఆడిట్ రిపోర్ట్స్ సమర్పించి, కొత్త కోర్సులు, జీతాల పెంపు, మౌలిక వసతుల కల్పన తప్పుడు ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సమర్పిస్తున్నారన్నారు. ఆయా ఖర్చుల వివరాలు పరిశీలించాకే ఫీజులు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 

గతంలో కూడా హడావుడిగా విచారణ చేసి, భారీగా ఫీజులు పెంచి, మళ్లీ తగ్గించడంతో కొన్ని కాలేజీల్లో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యాజమాన్యాలు వేధించాయన్నారు. బీ కేటగిరీ ప్రవేశాలు కూడా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా భర్తీ చేసి, అక్రమ పద్ధతుల్లో డోనేషన్లు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఫీజులను ఏకపక్షంగా పెంచితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు