Upper Circuit: ప్రముఖ ఇన్వెస్టర్ కొన్న స్టాక్.. ఎగబడుతున్న రిటైలర్స్, 20 శాతం అప్..

Upper Circuit: ప్రముఖ ఇన్వెస్టర్ కొన్న స్టాక్.. ఎగబడుతున్న రిటైలర్స్, 20 శాతం అప్..

SG Finserve Shares: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు సుదీర్ఘమైన కరెక్షన్ ఫేజ్ నుంచి తిరిగి కోలుకుంటున్నాయి. కొన్ని నెలలుగా తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోలు ఎరుపెక్కడం చూసిన ఇన్వెస్టర్లలో ప్రస్తుతం కొన్ని కంపెనీల షేర్లు తిరిగి లాభాల ఆశలను చిగురింపచేస్తున్నాయి. దీంతో మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లకు అకస్మాత్తుగా డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణంగా సదరు కంపెనీల షేర్లను పొందటానికి ఇన్వెస్టర్లు చూపిస్తున్న అధిక ఆసక్తిగా తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎస్‌జీ ఫిన్‌సర్వ్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి కంపెనీ షేర్లపై నేడు ఇన్వెస్టర్లు భారీగా బెట్టింగ్ వేసేందుకు ఎగబడటంతో స్టాక్ ఇంట్రాడేలో 20 శాతం భారీ పెరుగుదలతో అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి అత్యధికంగా రూ.432 స్థాయికి చేరుకుంది. అయితే ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో స్టాక్ ఎందుకు పెరిగిందనే విషయం వెనుక ఒక ప్రముఖ పెట్టుబడిదారుడు ఉన్నట్లు వెల్లడైంది. అవును ప్రఖ్యాత ఇన్వెస్టర్ మధుసూధన్ కేలా నిన్న ఒక్కో షేరును దాదాపు రూ.350 ధర వద్ద ఏకంగా 9.51 లక్షల స్టాక్స్ కొనుగోలు చేసినట్లు బీఎస్ఈ నివేధిక బయటకు వచ్చింది. 

ఎస్జీ ఫిన్ సర్వ్ అనేది ఒక స్మాల్ క్యాప్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. దీనికి స్టాక్ మార్కెట్లలో బిగ్ వేల్ గా పిలవబడే ఆశిష్ కచోలియా మద్దతు కూడా ఉండటంతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు నేడు ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు పరుగులు తీశారు. డిసెంబరు ముగిసిన త్రైమాసిక కాలాన్ని పరిశీలిస్తై కచోలియాకు ఈ కంపెనీలు 6.38 లక్షల షేర్లు ఉన్నాయి. అంటే ఆయన కంపెనీలో దాదాపు 1 శాతానికి పైగా వాటాను కమాండ్ చేస్తున్నట్లు డేటా చెబుతోంది. 

ALSO READ | US Visa: యూఎస్ వెళ్లాలంటే వణికిపోతున్న ఇండియన్ వీసా హోల్డర్లు.. స్పెషన్ నిఘా..

అయితే కంపెనీకి సంబంధించిన మరో శుభవార్త కూడా ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆకట్టుకుంది. అదేటంటే ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పాజిటివ్ రేటింగ్ అందించటమే. అలాగే ఇదే క్రమంలో అరిహంత్ క్యాపిటల్ కంపెనీ షేర్లకు BUY  రేటింగ్ అందిస్తూ భవిష్యత్ స్టాక్ టార్గెట్ ధరను రూ.783గా ప్రకటించటం కూడా ఇన్వెస్టర్లను ఉత్తేజపరిచిందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఇటీవల తన మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా రూ.236 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి తన వ్యాపార సత్తాను కూడా చాటుకోవటం పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకాన్ని నింపిందని తెలుస్తోంది.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.