ప్రైమరీ స్కూళ్లను నిర్లక్ష్యం చేయొద్దు: ఎస్​జీటీయూ

ప్రైమరీ స్కూళ్లను నిర్లక్ష్యం చేయొద్దు: ఎస్​జీటీయూ

ముషీరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్​జీటీయూ)​ అధ్యక్ష, కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికల వెంకటేశం డిమాండ్​ చేశారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని, పెండింగ్​ఉన్న 5 డీఏలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. 

10 వేల ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్ పోస్టులు మంజూరు చేసి, అర్హత కలిగిన ఎస్​జీటీలకు ప్రమోషన్​ ఇవ్వాలని కోరారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లందరికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.