భద్రాద్రికొత్తగూడెంలో పెండింగ్​ డబ్బులు చెల్లించాలని ఆశాల ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లెప్రసీ, పల్స్​ పోలియో సర్వేలకు సంబంధించిన పెండింగ్​ డబ్బులివ్వాలని డిమాండ్​ చేస్తూ ఆశా వర్కర్స్​బుధవారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవి కుమార్​ మాట్లాడారు. మూడేండ్లుగా పెండింగ్​లో ఉన్న డబ్బులను ఇచ్చామని ఉన్నతాధికారులు చెబుతున్నారని, డీఎంహెచ్​వోలు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారన్నారు.

 ఆ సర్వేల డబ్బులు ఇస్తేనే కొత్త సర్వేలు చేపడుతామంటూ స్పష్టం చేశారు. ఆశాలకు రూ. 18వేలు జీతం ఇవ్వాలని, ఈఎస్​ఐ, పీఎఫ్​ చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నేతలు పద్మ, ధనలక్ష్మి, జయ, రుక్మిణి, విజయ, సుశీల, చంద్రకళ పాల్గొన్నారు.