లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా మారిన శబరిమల వివాదం

లోక్‌ సభ ఎన్నికల్లో శబరిమల వివాదం తమకుఓట్లు కురిపిస్తుందని ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బీజేపీ లెక్కలు వేసుకుంది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ అనుమతించాలని పోయిన సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది. ఈ తీర్పు హిందూ సమాజంలో కలకలం రేపింది. రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కేరళలోని అన్ని ప్రాంతాల్లోజరిగిన ఈ నిరసన ప్రదర్శనల్లో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడతామని పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్‌ డీఎఫ్‌పేర్కొంటే, భక్తుల సెంటిమెంటే తమకు ముఖ్యమని బీజేపీ తెగేసి చెప్పింది. దీంతో హిందువుల ఓట్లు పోలరైజ్ అవుతాయని, ఈ పరిణామం తమకు ప్లస్పాయింట్ అవుతుం దని బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకున్నారు .

అలాగే, అంతకుముం దు కేరళలో వరద బీభత్సానికి కేంద్రం రూ.3,048.39 కోట్ల సాయం ప్రకటించింది. కేరళలోని 14 జిల్లాల్ లో వర్షా లు, వరదలతో తీవ్ర ప్రాణనష్టం కూడా జరిగిం ది. మొత్తం 488 మంది చనిపోయారు. పినరయి విజయన్‌‌ ప్రభుత్వం రూ. 4,700కోట్లు అడగ్గా, కేంద్రం మూడు వేల కోట్ల పై చిలుకుసాయం చేసింది. ఆ సమయంలో ఆరెస్సెస్‌‌ కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడి పునరుద్ధరణ పనులు చేశారు.ఇవన్నీ తమకు అనుకూలం కావచ్చని అంచనావేసింది.

అయితే, ఈ లెక్కల్లో తాజాగా తేడాలు వచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయ్యప్ప భక్తులు బీజేపీ వైపు కాకుండా కాం గ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు . శబరిమల వివాదంనేపథ్యం లో కాంగ్రెస్ కూడా అయ్యప్ప భక్తులకు మద్దతుగా ని లిచింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 16న పథనం తిట్ట నియోజకవర్గం లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ‘అయ్యప్ప భక్తులకు కాం గ్రెస్మద్దతు ఉంటుంద’ని క్లారిటీ ఇచ్చారు . ‘సంప్రదాయహిం దువుల మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు, ఎవరికైనా తమ మత విశ్వాసాలు ఆచరిం చేస్వేచ్ఛ ఉంటుంది’ అని స్పష్టం చేశారు. రాహుల్ తీసుకున్న వైఖరితో హిం దువుల ఓటు బ్యాంక్‌ లో చీలికవచ్చిందంటున్నారు . హిందువులకు అనుకూలంగా స్టాండ్ తీసుకున్న పార్టీలు రెండు…బీజేపీ, కాంగ్రెస్.వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నది లెఫ్ట్ ఫ్రంట్ ఒక్కటే.ఈ నేపథ్యంలో తమ సెంటిమెంట్‌‌ని పట్టించుకోని సీపీఎం నాయకత్వంలోని ఎల్‌ డీఎఫ్‌ కి వ్యతిరేకంగాఓటు వేయాలని సంప్రదాయ హిందువులు డిసైడ్ అయినట్లు  తిరు వనంతపురం పొలిటికల్ సర్కిల్స్ సమాచారం.

ఇక్కడో మెలిక ఉంది. కాంగ్రెస్‌‌తో పోలిస్తే కేరళలో బీజేపీ బాగా వీక్. రాష్ట్రంలోని మొత్తం 20లోక్ సభ సెగ్మెంట్లకు మూడో విడతలో ఈ నెల 23న ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నా యి. వీటిలో 18 లోక్ సభ సెగ్మెంట్లలో సీపీఎం నాయకత్వాన గల లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌ డీఎఫ్‌ ), కాంగ్రెస్ నాయకత్వాన గల యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్యనేపోటీ ఉంది. రెండు నియోజకవర్గాలు తిరు వనంతపురం, పథనంతిట్టలలో మాత్రమే బీజేపీ పుంజుకుం ది. బీజేపీకి ఎల్‌ డీఎఫ్‌ ని ఓడించే సత్తా లేకపోవడంతో వ్యూహాత్మకంగా కాం గ్రెస్‌‌కి మద్దతు పలకడానికి అయ్యప్పభక్తులు రెడీ అవుతున్నట్లు సమాచారం. లెఫ్ట్ ఫ్రంట్‌‌ని ఓడిం చగలనన్న  ధీమా బీజేపీ ఎక్కడ కల్పిస్తుందో…అక్కడ మాత్రం  ఆ పార్టీకి అనుకూలంగా ఉండాలని డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్.

సుప్రీం తీర్పుపై రివ్యూ వేయాల్సింది

శబరిమల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి నతర్వాత ఎల్‌ డీఎఫ్‌ సర్కార్ వ్యవహరించి న తీరును సంప్రదాయ హిందువులు దుయ్యబడుతున్నారు . సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం తాపత్రయ పడటానికి బదులుగా భక్తుల సెంటిమెంట్‌‌ని దృష్టిలో పెట్టుకుని తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసి ఉండాల్సిందని కోళికోడ్‌‌కి చెందిన సౌమ్యా  నాయర్ అన్నారు .తీర్పుపై రివ్యూ పిటీషన్ వేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని  విజయన్ సర్కారుపై ఆమె మండిపడ్డారు. హిందువుల ఎమోషన్స్‌‌ను కేరళ సర్కార్ పట్టించుకోలేదన్నారు . అయితే, లెఫ్ట్ ఫ్రంట్ సర్కారుని దెబ్బ తీయాలంటే బీజేపీ బలం చాలదన్నది ఆమె అభిప్రాయం. అందుకే కాంగ్రెస్ పట్ల అనుకూల వైఖరి తీసుకోవడం మినహా తమకు మరోగత్యం తరం లేదని క్లారిటీ ఇచ్చారు. ‘నాకు నా మత విశ్వాసాలే ముఖ్యం . ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని కాపాడాలి. అంతకుమించి రాజకీయ పార్టీల నుంచి నేనేమీ కోరుకోవడం లేదు’ అని సౌమ్యా నాయర్ పేర్కొన్నారు .

బీజేపీది పొలిటికల్అజెండా

అయ్యప్ప గుడి వివాదంలో బీజేపీకి చిత్తశుద్ది లేదని నాయర్ సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రెటరీ జి.సుకుమారన్ ఆరోపిం చారు. వివాదాన్ని రాజకీయంగా ఉపయోగిం చుకోవడానికి ప్రయత్నించిందని బీజేపీపై మండిపడ్డారు. ‘పార్లమెంటులో సంఖ్యా బలం ఉన్నప్పటికీ అయ్యప్ప భక్తులకు బీజేపీ ఏం చేసింది?’ అని సూటిగా ప్రశ్నించారు. బహిరంగంగా చెప్పకపోయినా, నాయర్ల సొసైటీ మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు . “లెఫ్ట్ ఫ్రంట్ ను ఢీకొట్టే సత్తా బీజేపీకి లేదన్నది వాస్తవం.అందుకే చాలా మంది కాంగ్రెస్ కు అనుకూల వైఖరి తీసుకుంటున్నా రని  పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖుడు అన్నారు .

కేరళ జనాభాలో ఎవరెంత శాతం?

కేరళ జనాభాలో హిందువులు 52 శాతం మంది ఉన్నారు . ముస్లింలు 26 శాతం మంది, క్రిస్టియన్లు 18 శాతం మంది ఉన్నారు . మిగతా నాలుగు శాతంమంది వివిధ వర్గాల ప్రజలు. హిందువుల్లో 16 శాతంమంది పెద్ద కులమైన నాయర్లే ఉన్నారు . వీరి ప్రయోజనాలను కాపాడటానికి ‘నాయర్ సర్వీస్ సొసైటీ’పేరుతో ఓ సంస్థ ఉంది. రాజకీయాలకతీతంగా పనిచేసే ఈ సంస్థ తమకు నచ్చి న వారికి ఓటేయమని లేటెస్ట్ గా సభ్యులకు సలహానిచ్చింది.