టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పై.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. రేవంత్ రెడ్డి యాత్రను చూస్తుంటే తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారని ఆయన చెప్పారు. అప్పట్లో వైఎస్ఆర్ చెల్లెమ్మా అంటూ చేవెళ్ల నుంచి యాత్ర చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ సీతక్క అంటూ ములుగు నుండి యాత్ర మొదలు పెట్టారని షబ్బీర్ అలీ చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా రాహుల్ సందేశాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లి.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటామన్నారు. రేవంత్ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులతో యాత్ర జరుగుతోందన్నారు.