కామారెడ్డి టౌన్, వెలుగు: అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. భిక్కనూరు, బీబీపేట మండలాలకు చెందిన పలువురు సోమవారం కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. స్టేట్‌లో ఏ శాఖ కూడా సరిగ్గా పని చేయడం లేదని, ఆరోగ్య శాఖ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందన్నారు.
వ్యాధులతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథులు లేకుండా పోయారన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. యువనేతలు ప్రజలను కలుస్తూ వారిని చైతన్యం చేయాలన్నారు. అంతకు ముందు ప్రజా గాయకుడు గద్దర్మరణానికి సంతాపం తెలిపారు. ఆయన ఫొటోకు పూలదండ వేసి నివాళి అర్పించారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, వైస్‌ప్రెసిడెంట్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, లీడర్లు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, గొనే శ్రీనివాస్, సందీప్, భీంరెడ్డి, రమేశ్, గణేశ్‌నాయక్, పాత శివకృష్ణమూర్తి పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వీరే..
కామారెడ్డి మండల యూత్ప్రెసిడెంట్గా బత్తుల కిషన్, టౌన్ప్రెసిడెంట్గా గుడుగుల శ్రీనివాస్, రాజంపేటకు అంకం కృష్ణారావు, దోమకొండకు ఆశబోయిన శ్రీనివాస్, బీబీపేటకు జీవన్‌రెడ్డి, మాచారెడ్డికి చెల్లాపురం రాజిరెడ్డి, భిక్కనూరుకు తిరుపతిగౌడ్లను నియమిస్తున్నట్లు షబ్బీర్‌అలీ తెలిపారు.