- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
కామారెడ్డి, వెలుగు : తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ విమర్శించారు. మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలోని పంక్షన్హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కురాజీనామా చేసి షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ అభివృద్ధి ఏమోగానీ అప్పులపాలు మాత్రం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు5 గ్యారంటీలు అమలు చేశామని, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ త్వరలోనే చేస్తామన్నారు. పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ఎంపీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్, లీడర్లు ఎడ్ల రాజిరెడ్డి, భీంరెడ్డి, గాల్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి పాల్లొన్నారు