కేటీఆర్ ఓ బచ్చా.. కేసీఆర్ ఒక దుర్మార్గుడు: షబ్బీర్ అలీ ఫైర్

కేటీఆర్ ఓ బచ్చా.. కేసీఆర్ ఒక దుర్మార్గుడు: షబ్బీర్ అలీ ఫైర్

నిజామాబాద్: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. మంగళవారం (జనవరి 7) నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు నివాళులర్పించిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఊసరవెల్లి‎లా కేటీఆర్ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు.

ALSO READ  | యూత్ కాంగ్రెస్కు పీసీసీ చీఫ్ వార్నింగ్.. పార్టీ ఆఫీస్లపై దాడులు కరెక్ట్ కాదు: మహేశ్ కుమార్ గౌడ్

 కార్యకర్తల కష్టంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు బలంగా ఉంటే.. పార్టీ బలంగా ఉంటుందన్న షబ్బీర్ అలీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, కేసీఆర్ లాగా గుట్టలు, రాళ్ళు, రియల్టర్లు‎కు రైతు భరోసా ఇవ్వమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.