కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీముల పేరిట ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ విమర్శిచారు. గురువారం రామారెడ్డి మండలం మద్దికుంటలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్పాంప్లెంట్స్ను ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధులు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకే తప్ప, సామాన్య ప్రజలకు కాదన్నారు. కామారెడ్డి ప్రజలకు కేసీఆర్‌ను ఓడించే సువర్ణావకాశం వచ్చిందన్నారు.
మద్దికుంట బుగ్గరామలింగేశ్వర టెంపుల్‌కు కాంగ్రెస్హయాంలోనే రాష్ర్టస్థాయి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పేదలకు భూములు పంచితే, కేసీఆర్ ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్లతో ట్రెంచులు కొట్టించి భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి అందిస్తామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, రామారెడ్డి జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, లీడర్లు నర్సాగౌడ్, ప్రవీన్, లచ్చిరెడ్డి, లింగం, చిన్న రాజు పాల్గొన్నారు.