కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు మాత్రమేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కామారెడ్డి, నిజామాబాద్ కి నీళ్ల కోసం రెండు వేలు ఖర్చు చేస్తే, రూ. 3లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి కానీ.. ప్రాజెక్టు కట్టడం లేదన్నారు. టీఆరెస్ ప్రభుత్వానికి గవర్నర్ కూడా ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదన్నారు. కోవిడ్ పై ప్రభుత్వ చర్యలపై గవర్నర్ ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు.
నేను డీజీపీ, సీఎంకి ఎన్ని సార్లు లేఖలు రాసినా సమాధానం లేదని.. గాంధీ హాస్పిటల్ లో శవాలు, కోవిడ్ రోగులను ఒకే బెడ్ పై పెడుతున్నారని తెలిపారు. కాళేశ్వరంకి లైఫ్ లైన్ ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందని చెప్పారు. పోలీసుల వ్యవహారంపై లీగల్ గా వెళ్తామన్న ఆయన..సెక్షన్-8 అధికారాలను గవర్నర్ ఉపయోగించుకోవాలన్నారు షబ్బీర్ అలీ.