కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టీజీవో, టీఎన్జీవో సంఘాల డైరీ, క్యాలెండర్లను షబ్బీర్‌అలీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.
గత ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిందని, ఈ జీవో ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు సబ్‌కమిటీ వేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఈ నెల 27న మరో రెండింటిని అమలు చేయబోతున్నామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ALSO READ : ఎన్టీఆర్ నేర్పిన సంస్కారంతో పనిచేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరరావు
టీజీవో, టీఎన్జీవోల బిల్డింగులనిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. షబ్బీర్‌అలీని ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆయా శాఖల ఆఫీసర్లు సన్మానించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, టీజీవో స్టేట్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్, టీజీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రెటరీలు దేవేందర్, సాయిరెడ్డి, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రెటరీలు వెంకట్‌రెడ్డి, సాయిలు, ప్రతినిధులు అలుక కిషన్, శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్తదితరులు పాల్గొన్నారు.