లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తం : షబ్బీర్ అలీ

లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తం : షబ్బీర్ అలీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  

హైదరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో కులగణన చేసే ధైర్యం కేసీఆర్ చేయలేదని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేపట్టిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నదని పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దమ్మున్న సర్కార్ అని, పదేండ్లలో కేసీఆర్ చేయలేనిది కాంగ్రెస్ చేసి చూపించిందని తెలిపారు. 

ఎస్సీల వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసెంబ్లీలో పెట్టబోతున్నదని వెల్లడించారు. కులగణనపై సబ్ కమిటీ నివేదిక కూడా ప్రజల ముందు పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం, మంత్రులు, పార్టీ అగ్రనేతలు రాహుల్, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. కులగణన చేసే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదని.. దాన్ని రాహుల్ గాంధీ చేసి చూపిస్తున్నారన్నారు. ఎవరి వాటా ఎంతో అన్ని  ఫలాలు వారికి అందాలనేది రాహుల్ గాంధీ విజన్ అని పేర్కొన్నారు. ఇండియన్ హిస్టరీలోనే అక్యురేట్ సర్వే ఇది అని షబ్బీర్​అలీ పేర్కొన్నారు.