కేసీఆర్ది డబుల్ గేమ్ : షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కేసీఆర్ కంటే ముందే తానే మంత్రిని అయ్యానని చెప్పారు. తక్కువ దూరంలో హెలికాఫ్టర్​ లో మంత్రి కేటీఆర్ తిరగడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. 2004లో పొత్తు ఉన్నప్పటికీ తనపై బీఆర్ఎస్​ (అప్పటి టీఆర్ఎస్) పోటీ చేసిందన్నారు. కామారెడ్డి సభలో మంత్రి కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. కేసీఆర్ ది డబుల్ గేమ్ అని చెప్పారు. 

కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులు వచ్చాయన్నారు షబ్బీర్ అలీ. కేసీఆర్ కుటుంబంలో అందరిపై కేసులు ఉన్నాయన్నారు. అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించారు. తనపై ఒక్క పీటీ కేసు కూడా లేదన్నారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పెద్ద సినిమా చూపిస్తారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేసీఆర్ ను ఓడించి ఇంటికి పంపిస్తామన్నారు.