కామారెడ్డి, వెలుగు: కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ విమర్శించారు. బుధవారం బీజేపీ కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా మాజీ ప్రెసిడెంట్దత్తేశ్వరి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీడర్లు అనర్హులకు డబుల్ బెడ్రూమ్ఇండ్లు కేటాయిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. లీడర్లు చందు, శ్రీను, లక్ష్మణ్, శివ కృష్ణమూర్తి పాల్గొన్నారు.