కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి.. కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద నుంచి డిసెంబర్ 28 నుంచి ఈరోజు(జనవరి 06) వరకు దరకాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్ అని షబ్బీర్ అలీ అన్నారు.
జనవరి చివరి వరకు వంట గ్యాస్ రూ. 500 లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు.. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఏమి చేయలేదని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని షబ్బీర్ అలీ వివరించారు.