కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడిస్తా : మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి కామారెడ్డిలో  కేసీఆర్​ను ఓడిస్తానని మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేర్కొన్నారు. బుధవారం దోమకొండ, బీబీపేట, పాల్వంచ మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన కుల సంఘాల ప్రతినిధులు జిల్లా కేంద్రంలో  షబ్బీర్​అలీని కలిశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్, కామారెడ్డి  రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.

కామారెడ్డిలో  సీఎంను పోటీ చేయాలని ఎవరు కోరలేదని, బీఆర్ఎస్​నేతలే అలా చెప్పుకుంటున్నారన్నారు. గంప గోవర్ధన్​ ఓటమి భయంతోనే తప్పుకోవడం వల్ల, సీఎం కేసీఆర్​ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ​ప్యాకేజీ 22కు రూ.5 వేల కోట్లు ప్రకటించి కేసీఆర్​ఇక్కడికి రావాలని సవాలు విసిరారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.