శబ్దం యూనిక్ కాన్సెప్ట్‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేస్తుంది: ఆది పినిశెట్టి

శబ్దం యూనిక్ కాన్సెప్ట్‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేస్తుంది: ఆది పినిశెట్టి

‘‘వైశాలి అనేది నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ మూవీ. ఇప్పుడు చూసినా రిలవెంట్‌‌‌‌గా ఉంటుంది. కథలోని నిజాయితీ అది. అదే నిజాయితీతో ‘శబ్దం’ తీశాం. రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా యూనిక్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేస్తుంది. మంచి కథాబలంతో పాటు ఎమోషన్ ఉంది. ఆత్మలని ఒక సైంటిఫిక్ పద్దతిలో అన్వేషించే విధానం కొత్త అనుభూతిని పంచుతుంది. అలాగే  స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌‌‌‌గా ఉంటుంది.  టెక్నికల్‌‌‌‌గా రిచ్‌‌‌‌గా కనిపిస్తూ థియేటర్స్‌‌‌‌లోనే చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది.   

సౌండ్‌‌‌‌తో ఆత్మలను పసిగట్టే పారనార్మల్  ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ నాది.  అందుకే ప్రతి సీన్‌‌‌‌లో సౌండ్‌‌‌‌కు ఇంపార్టెన్స్ ఉంది. ఆ సౌండ్ డిజైన్ చాలా అద్భుతంగా కుదిరింది. తమన్ గారి సంగీతం చాలా ప్లస్ అయ్యింది. డీవోపీ అరుణ్ అద్భుత మైన విజువల్స్ ఇచ్చారు. సిమ్రన్, లైలా గారి పాత్రలు సినిమాలో కీలకంగా వుంటాయి.  మైత్రీ మూవీ మేకర్స్, ఎన్ సినిమాస్ తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.  ప్రస్తుతం ‘అఖండ 2’తో పాటు దేవ కట్టా గారు తీస్తున్న ‘మయసభ’లో నటిస్తున్నా. అలాగే డ్రైవ్, మరకతమణి 2 జరుగుతున్నాయి’’.

ఆది పినిశెట్టి హీరోగా నటించిన సూపర్‌‌‌‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. అరివళగన్‌‌‌‌ దర్శకుడు.  'వైశాలి’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌లో రూపొందిన ఈ చిత్రం  ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి ఇలా ముచ్చటించారు.