ఊర్లో లిక్కర్​ అమ్మితే రూ.50 వేలు ఫైన్​... గ్రామస్తుల తీర్మానం

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్న గూడా గామస్తులు మద్యాన్ని బహిష్కరించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల ప్రజలు పనులు మానుకొని మద్యానికి బానిసై కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని, గ్రామస్తులు అందరూ సమావేశమై మద్య నిషేదాన్ని తీర్మానించారు.

పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలోని బెల్టు షాపు యజమానులకు నోటీసులు అందజేశారు. మద్యం అమ్మితే రూ. 50 వేల జరిమాన విధించాలని, ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే షాపులు ధ్వంసం చేస్తామని షాపు యజమానులకు హెచ్చరిక జారీ చేశారు.