షాద్ నగర్ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ గ్యాస్ పేలుడు : ఆరుగురు కార్మికులు మృతి

షాద్ నగర్ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ గ్యాస్ పేలుడు : ఆరుగురు కార్మికులు మృతి

షాద్ నగర్లో దారుణం జరిగింది. గ్లాస్ ఫ్యాక్టరీలో గ్యాస్ బ్లాస్ట్ అయ్యింది.ఈ  ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే, షాద్ నగర్ పరిధిలోని బూర్గుల  గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెసర్  గ్యాస్ బ్లాస్ట్ జరిగి 15 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరు మంది మృతి చెందారు. గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్యాస్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 150మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.