బస్టాండ్ రిపేర్ నేపథ్యంలో ప్రయాణికులకు పట్టించుకోకపోవడంతో వెలగులో సోమవారం వచ్చిన ‘బస్టాండ్ కూల్చి ఎండలో నిల్చొబెట్టి’ కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. మంగళవారం బస్టాండ్ ఆవరణలో టెంట్ ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన పిట్లం బస్టాండ్ రిపేర్ కోసం నెల రోజుల కింద కూల్చి వేశారు.
ప్రయాణికులకు నీడ సౌకర్యం కల్పించకుండా వదిలేయడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వెలుగులో కథనం రావడం.. సమస్య పరిష్కారం కావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - పిట్లం, వెలుగు