
సెక్రటేరియట్ మీదున్న శ్రద్ధ పేదలకు ఇచ్చే ఇండ్లపై లేదా?
ఓట్ల రాజకీయం కోసమే ఇవ్వకుండా ఆపారు
షాద్‌నగర్ బీజేపీ నాయకుల ఆరోపణ
షాద్ నగర్, వెలుగు : నిరుపేదల కోసం కట్టిన డబుల్బెడ్రూమ్ఇండ్లను పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని షాద్నగర్బీజేపీ నాయకులు ప్రశ్నించారు. కొత్త సెక్రటేరియట్నిర్మించడం మీద ఉన్న శ్రద్ధ పేదల కోసం కట్టిన ఇండ్లను పంచడంలో లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్ల రాజకీయం చేసేందుకే పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్పెట్టారని ఆరోపించారు. షాద్ నగర్ లోని హాజీపల్లి వద్ద పూర్తయిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను బీజేపీ లీడర్లు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్‌లో నిర్మించిన 920 ఇండ్లు, కొత్తూరులో 60, నందిగామలో128, దూసకల్ శివారులో 368, సోలిపూర్ శివారులో 380 కలిపి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 1,856 ఇండ్లు పంపిణీకి రెడీగా ఉన్నాయని, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉగాది పండుగలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయకపోతే తామే గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. అలాగే స్థలం చూపిస్తే ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.