ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించాం : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్, వెలుగు: ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించామని షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కు చెల్లించుకున్నారు.

అనంతరం షాద్ నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్   పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. వారు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఆయన వెంట మహమూద్, ఆగిరి రవి గుప్తా కుమార్, సయ్యద్ రియాజ్, ఆంజనేయులు ఉన్నారు.