- ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన షాద్‌నగర్ ఘటనలో పోలీసులపై వేటు పడింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దొంగతనం కేసులో సునీత అనే మహిళను పీఎస్‌కు పిలిపించి పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
దీంతో షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో విచారణ జరిపించారు. నివేదిను సీపీకి ఏసీపీ రంగస్వామి సమర్పించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేశారు.