స్వీపర్​, వాచ్​మెన్​కు రూ.72 వేలు ఇచ్చిన ఎమ్మెల్యే

షాద్ నగర్, వెలుగు: చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్దలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన జీతం నుంచి రూ. 72 వేలను స్వీపర్​కు, వాచ్​మెన్​కు అందజేశారు. కాలేజీకి ఒక కంప్యూటర్ ను ఇచ్చారు. ప్రిన్సిపాల్ మంజుల, గ్రామ పెద్దలు శ్యామ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి,సీనియర్ నేత రఘు,కుమార్ గౌడ్, చంద్రశేఖర్, సింగారం సుదర్శన్, ముబారక్ అలీఖాన్ తదితరులున్నారు.