- షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసుల్లో కరప్షన్ అనే పదం వినపడకూడదని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. సోమవారం షాద్ నగర్ లోని క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి కానుకగా నాలుగు పథకాలకు మంత్రివర్గం ఆమోదించిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించబోతున్నామన్నారు.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, అక్కడక్కడా అరకొరగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు లేవని విమర్శించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, చలో శ్రీకాంత్ రెడ్డి, వీరేశం, మాజీ జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్చైనీస్ తిరుపతిరెడ్డి, రఘునాయక్, దంగు శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం రెడ్డి , లింగారెడ్డిగూడెం అశోక్ ఉన్నారు.