‘హైడ్రా సేవలను విస్తరించండి’.. సీఎంకు షాద్ నగర్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

‘హైడ్రా సేవలను విస్తరించండి’.. సీఎంకు షాద్ నగర్ ఎమ్మెల్యే  విజ్ఞప్తి

షాద్ నగర్, వెలుగు: హైడ్రా పరిధిని తమ ప్రాంతం వరకు విస్తరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన కలిసి నియోజకవర్గానికి హైడ్రా సేవల విస్తరణ, అభివృద్ధి పనులపై చర్చించారు. హైదరాబాద్​కు కూతవేటు దూరంలో ఉన్న షాద్ నగర్​కు హైడ్రా సేవలను విస్తరిస్తే మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం షాద్ నగర్, కొత్తూరు మున్సిపాలిటీలకు టీయుఎఫ్ఐడీసీ ద్వారా అదనపు నిధులు కేటాయించాలని కోరారు.

కాలువపై ఫంక్షన్ హాల్ 

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలోని సాయిరెడ్డి చెరువు నుంచి కాశన్న కుంట వరకు వెళ్లే పాటు కాలువను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించారని గణపతి కాలనీలో వాసులు ఆరోపించారు. తద్వారా తమ కాలనీలోకి  నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ కమిషనర్,హెచ్ఎండీఏ అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా హైడ్రా పరిధిని తమ వరకు విస్తరించి న్యాయం చేయాలని కోరుతున్నారు.