ఒడిశాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 25 సంవత్సరాలు ఏకదాటిగా ఆ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసి.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. ఇప్పటి వరకూ ఇలాంటి నిర్ణయం ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేదు. అదే షాడో క్యాబినెట్.. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్పాటు చేశారు. 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలు కేటాయించారు. ఇలా వారివారి శాఖపై పర్యవేక్షిస్తారు.
ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా నిరంతరం ఆయా శాఖ ఎమ్మెల్యే నిఘా పెడతాడు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి ప్రజలకు మంచి జరిగేలా చూస్తోంది ఈ ష్యాడో క్యాబినెట్.. ఈ నిర్ణయం విన్నకా చాలామంది నవీన్ పట్నాక్ ను మెచ్చుకుంటున్నారు. షాడో మంత్రివర్గానికి సంబంధించి అపోసిషన్ పార్టీ ఉత్తర్వు జారీ చేసింది. నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ షాడో క్యాబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. అలాగే ఎలాంటి అధికారాలు ఉండవు. జూలై 22 నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.
అప్పుడు ఆయా శాఖ ష్యాడో మినిస్టర్ వారి శాఖలకు బాధ్యత వహిస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌లో ప్రతిపక్ష పార్టీలకు ‘షాడో క్యాబినెట్’ మాదిరి సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. కెనడాలో షాడో మంత్రులను అపోసిషన్ క్రిటిసైజర్ అని పిలుస్తారు. బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు.