INDW vs SAW: 191 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన షెఫాలీ

INDW vs SAW: 191 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన షెఫాలీ

భారత మహిళా క్రికెట్ లో ఓపెనర్ షెఫాలీ వర్మకు లేడీ సెహ్వాగ్ అనే బిరుదు ఉంది. క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకోకుండానే  తొలి బంతి నుంచే భారీ షాట్స్ కు ప్రయత్నిస్తుంది. ఈమె విధ్వంసం తాజాగా టెస్టుల్లోనూ మొదలైంది. దక్షిణాఫ్రికాపై జరుగుతున్న ఏకైక టెస్టులో వీర బాదుడు బాదుతుంది. మెరుపు డబుల్ సెంచరీతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉంది. ఈ ఆసీస్ ప్లేయర్ కు 248 బంతులు అవసరం కాగా.. శేఫాలికి 191 బంతులే అవసరమయ్యాయి. 

113 బంతుల్లో తన టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసిన షెఫాలీ మరో 100 పరుగులకు 78 పరుగులు మాత్రమే తీసుకుంది. ఈ మ్యాచ్ మొత్తం 197 బంతుల్లో 205 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగింది. ఈమె ఇన్నింగ్స్ లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. శేఫాలికి తోడు స్మృతి మందనా (149) భారీ సెంచరీ చేయడంతో తొలి రోజు భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు 85 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (53), హర్మన్ ప్రీత్ కౌర్ (17) క్రీజ్ లో ఉన్నారు. తొలి రోజు ఐదుకు పైగా   రన్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. 

మహిళల టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

షఫాలీ వర్మ (ఇండియా): 194 బంతుల్లో (దక్షిణాఫ్రికాపై, 2024)

అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా): 248 బంతుల్లో (దక్షిణాఫ్రికాపై, 2024)

కరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా): 306 బంతుల్లో (ఇంగ్లాండ్ పై, 2001)