Team India: నా తండ్రికి గుండెపోటు.. జట్టు నుంచి తప్పించారని చెప్పలేకపోయా: భారత ఓపెనర్

ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపై సెలెక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసిందే,  గత ఏడాది ఆస్ట్రేలియాలో ఆడే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెను తప్పించారు. 20 ఏండ్ల షెఫాలీ 2024 వన్డేల్లో ఆరు వన్డేల్లో 108 రన్స్ మాత్రమే చేయడంతో ఆమెపై వేటు పడింది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ షెఫాలీకి చోటు దక్కలేదు. తనకి భారత జట్టులో స్థానం దక్కలేదనే విషయాన్ని తన తండ్రికి చెప్పలేదని షెఫాలీ తెలిపింది. 

గుండెపోటుతో బాధపడుతున్న తన తండ్రితో భారత జట్టు నుండి తొలగించబడిన వార్తలను చెప్పలేదని.. ఒక వారం తర్వాత తన తండ్రి కోలుకున్నాక చెప్పానని షెఫాలీ చెప్పుకొచ్చింది. "నేను భారత జట్టులో స్థానం కోల్పోయినప్పుడు చాల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. నేను జట్టు నుండి తొలగించబడటానికి రెండు రోజుల ముందు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పడానికి    ఇష్టపడలేదు. అతను కోలుకునే వరకు ఈ విషయాన్ని దాచాను. నేను ఒక వారం తర్వాత అతనికి చెప్పాను, ”అని షఫాలీ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. 

ALSO READ | Champions Trophy 2025: కెరీర్ మొత్తం గాయాలే: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఔట్

షెఫాలీ వర్మను తప్పించిన సెలక్టర్లు ఆమె స్థానంలో ప్రియా పునియాను ఎంపిక చేశారు. షెఫాలీ స్థానంలో ఇటీవలే ఓపెనర్ గా వచ్చిన ప్రతీకా రావల్ దూసుకొస్తోంది. ఆమె ఆడిన తొలి ఆరు వన్డేల్లో ఏకంగా 444 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. ఐర్లాండ్ పై బుధవారం (జనవరి 15) జరిగిన చివరిదైన మూడో వన్డేలో ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ తో 154 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. దీంతో షెఫాలీ భారత జట్టులోకి రావాలంటే మరింత శ్రమించాల్సిందే.