సిల్హెట్: టార్గెట్ ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (38 బాల్స్‌లో 8 ఫోర్లతో 51), స్మృతి మంధాన (42 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 47) రాణించడంతో.. గురువారం జరిగిన మూడో టీ20లోనూ ఇండియా విమెన్స్ టీమ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది.
టాస్ ఓడిన బంగ్లా 20 ఓవర్లలో 117/8 స్కోరు చేసింది. దిలారా అక్తర్ (39) టాప్ స్కోరర్. నిగర్ సుల్తానా (28) ఫర్వాలేదనిపించినా, శోభన మోస్ట్రే (15)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. రాధా యాదవ్ 2 వికెట్లు తీసింది. తర్వాత ఇండియా 18.3 ఓవర్లలో 121/3 స్కోరు చేసింది. స్మృతి, షెఫాలీ తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
9 రన్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔటైనా, హేమలత (9), హర్మన్ (6 నాటౌట్), రిచా ఘోష్ (8 నాటౌట్) విజయాన్ని అందించారు. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సోమవారం ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరుగుతుంది.